తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-మసద్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 111వ సూరా, 5 ఆయతులు, 603వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అన్-నస్ర్సూరా అల్-ఇఖ్లాస్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక![1]

[1] చూడండి, 15:23.

2. అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!

3. అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!

4. మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ![1]

[1] ఆమె దైవక్త ('స'అస) బాటలో ముండ్లు వేసేది. అతనికి విరుద్ధంగా చాడీలు చెప్పేది. చూడండి, 15:23.

5. ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.[1]

[1] జీదున్: మెడ మసదున్: ఖర్జూరపు నారతో బాగా పేనిన గట్టి త్రాడు.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అన్-నస్ర్సూరా అల్-ఇఖ్లాస్ ›