తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-ఇఖ్లాస్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 112వ సూరా, 4 ఆయతులు, 604వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-మసద్సూరా అల్-ఫలఖ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.[1]

[1] అ'హదున్: The One and Alone, ఏకైకుడు.

2. ఎవరి అక్కరా లేని వాడు, (సర్వులూ ఆయనపైనే ఆధారపడతారు).[1]

[1] అ'స్సమదు: Absolute, Eternal, Besought of All, to Whom obedience is rendered. Without whom no affair is accomplished సమస్త వ్యవహారాలు తన మీదనే ఆధారపడి ఉన్నవాడు, నిత్యుడు, శాశ్వతుడు, నిరంతరుడు. అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. ఆయనకు ఎవ్వరి అక్కర లేదు. ఆయన నిరపేక్షుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

3. ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.

4. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."[1]

[1] లైస క మిస్'లిహీ షయ్ఉన్' 42:11. ఒక 'హదీస్'ఖుద్సీ: "మానవుడు నన్ను దూషిస్తాడు, అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను, ఒక్కడను, అద్వితీయుడను. ఎవరి అక్కరలేని వాడను, నేను ఎవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైనవాడు గానీ నాతో పోల్చదగినవాడు గానీ ఎవ్వడూ లేడు," ('స. బు'ఖారీ).

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-మసద్సూరా అల్-ఫలఖ్ ›