తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అత్-తీన్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 95వ సూరా, 8 ఆయతులు, 597వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అష్-షర్హ్సూరా అల్-అలఖ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!

2. సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా![1]

[1] చూ'చూడండి, 15:23.

3. ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా![1]

[1] చూఈ శాంతి నగరం అంటే మక్కా ముకర్రమా చూడండి, 2:126 ఇందులో యుద్ధం చేయటం నిషేధించబడింది. ఇందులో ప్రవేశించిన వానికి శాంతి, భద్రతలు లభిస్తాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది మూడు చోట్లను సూచిస్తుంది. (1) 'తూర్ పర్వతం - మూసా ('అ.స.) ను ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం, (2) బైతుల్ ముఖద్దస్-'ఈసా ('అ.స.) పుట్టి ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం, (3) మక్కా ముకర్రమా - ము'హమ్మద్ ('స'అస) పుట్టి ప్రవక్తగా ఎన్నుకోబడ్డ స్థలం. (ఇబ్నె-కసీ'ర్). మక్కా ప్రస్తావనకు ఇంకా చూడండి 48:24.

4. వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.[1]

[1] చూడండి, 91:7, 97:2 మరియు 75:38

5. తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.

6. కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.

7. అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?

8. ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అష్-షర్హ్సూరా అల్-అలఖ్ ›