తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-హుమజహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 104వ సూరా, 9 ఆయతులు, 601వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-అస్ర్సూరా అల్-ఫీల్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.[1]

[1] హుమ'జహ్ మరియు లుమ'హజ్: కొందరి అభిప్రాయంలో ఒకే అర్థం గలవి. మరి కొందరు వాటి మధ్య భేదం చూపుతారు. హుమ'జహ్ - అంటే ముఖం మీద అపనిందలు చేసేవారు. లుమ'జహ్ - అంటే వీపు వెనుక చాడీలు చెప్పేవారు. మరికొందరు హుమ'జహ్ - అంటే కండ్ల సైగలతో, చేతి సైగలతో దూషించటం మరియు లుమ'జహ్ - అంటే నోటి మాటలతో దూషించటం, అని అంటారు.

2. ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో![1]

[1] అంటే 'జకాతు మరియు 'సదఖాత్ ఇవ్వకుండా ఉంటాడో!

3. తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు![1]

[1] అ'ఖ్ లదహ్: అంటే అది అతనిని మరణించకుండా చేస్తుందని భావిస్తాడు.

4. ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగద్రొక్కే (నుగ్గునుగ్గు చేసే) నరకాగ్నిలో వేయబడతాడు.[1]

[1] అల్-'హు'తమతు: నరకాగ్ని పేర్లలో ఒకటి. చూడండి, 15:43-44. ముక్కలు ముక్కలుగా చేసేది.

5. ఆ (అణగద్రొక్కే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?[1]

[1] ఆ అగ్ని ఎంతో భయంకరమైనది. దాని తీవ్రతను బట్టి మీ బుద్ధి అర్థం చేసుకోజాలదు.

6. అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;

7. అది గుండెల దాకా చేరుకుంటుంది.

8. నిశ్చయంగా, అది వారి మీద మూసివేయబడి ఉంటుంది.[1]

[1] ముఅ''సదతున్: మూసివేయబడినది. ఆ నరకపు ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవ్వరూ దాని నుండి బయట పడలేరు.

9. (వారు) పొడుగాటి స్తంభాలలో (బంధించబడి ఉంటారు)!

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-అస్ర్సూరా అల్-ఫీల్ ›