తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-అస్ర్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 103వ సూరా, 3 ఆయతులు, 601వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అత్-తకాథుర్సూరా అల్-హుమజహ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. కాలం సాక్షిగా![1]

[1] అల్లాహ్ (సు.తా.) తాను కోరిన దాని సాక్ష్యం తీసుకుంటాడు. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరి సాక్ష్యం తీసుకోరాదు.

2. నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు![1]

[1] ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.

3. కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప![1]

[1] ఇలాంటి నష్టం నుండి తప్పించుకోగల వారు ఎవరంటే: ఒకే ఒక్క ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను పాటించేవారు, అల్లాహ్ (సు.తా.) నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారు, కష్టకాలంలో సహనం వహించి, సత్య ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అత్-తకాథుర్సూరా అల్-హుమజహ్ ›