ముస్‌హఫ్‌లో 102వ సూరా, 8 ఆయతులు, 600వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. (ఇహలోక సంపదలను, సంతానాన్ని) అధికంగా పోగుచేసుకోవాలనే పోటీ మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;[1]
[1] అల్ హా (యుల్ హీ): ఏమరుపాటులో వేసింది. తకాసు'రున్: ఎక్కువ పొందాలనే పేరాస అంటే ధనధాన్యాల కొరకు, పిల్లల కొరకు, బలం, ప్రభుత్వం, పేరు ప్రతిష్టల కొరకు చేసే పేరాస.
2. మీరు గోరీలలోకి చేరే వరకు.[1]
[1] ఆ పేరాస కోసం ప్రయత్నిస్తూనే మీరు గోరీలలోకి చేరి పోతారు.
3. అలా కాదు! త్వరలోనే మీరు తెలుసుకుంటారు.
4. మళ్ళీ, అలా కాదు! త్వరలోనే మీరు తెలుసుకుంటారు.[1]
[1] ఇది మంచిది కాదని.
5. ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).
6. నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని తప్పక చూస్తారు!
7. మళ్ళీ (చెబుతున్నాము)! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సందేహమైన (నిశ్చిత) దృష్టితో చూస్తారు!
8. అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు![1]
[1] అప్పుడు అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాలను ధనసంపత్తులను మంచి కొరకు ఉపయోగించిన వారు స్వర్గవాసులవుతారు. వాటిని దుష్టప్రయోజనాలకు వినియోగించిన వారు నరకాగ్ని పాలవుతారు.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.