తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-ఇంషిఖాఖ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 84వ సూరా, 25 ఆయతులు, 589వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ముతఫ్ఫిఫీన్సూరా అల్-బురూజ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు![1]

[1] అంటే పునరుత్థాన దినము

2. మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.[1]

[1] చూడండి, 20:105-107.

3. మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;

4. మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;

5. అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.

6. ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని కష్టపడుతూ (శ్రమిస్తూ) సాగిపోతున్నావు, తీవ్రమైన శ్రమతో. అప్పుడు నీవు ఆయనను (నీ ప్రభువును) కలుసుకుంటావు.

7. అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;[1]

[1] చూడండి, 69:19.

8. అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.

9. మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!

10. ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;[1]

[1] చూడండి, 69:25-26.

11. అప్పుడతడు తన నాశనాన్నే కోరుకుంటాడు;

12. మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.

13. వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.[1]

[1] చూడండి, 75:33.

14. వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.

15. ఎందుకు మరలిరాడు! నిశ్చయంగా, అతని ప్రభువు అతనిని సదా గమనిస్తూనే ఉన్నాడు.

16. కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను![1]

[1] అష్-షఫఖు: సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో కనబడే ఎరుపు, సంధ్యారుణిమ. అది 'ఇషా సమయం మొదలయ్యే వరకు ఉంటుంది.

17. రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!

18. పూర్ణచంద్రుని సాక్షిగా![1]

[1] అత్తసఖ: అంటే పౌర్ణిమనాటి చంద్రుడు.

19. మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]

[1] 'తబఖున్: కఠినత, ఇక్కడ కఠినాలు అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారటం.

20. అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?

21. మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?[1]

[1] 'హదీస్'ల ద్వారా దైవప్రవక్త ('స'అస) మరియు 'స'హాబా(ర'ది.'అన్హుమ్)లు, ఇక్కడ సజ్దా చేశారని తెలుస్తుంది.

22. అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.

23. మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

24. కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -

25. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతంకాని ప్రతిఫలం ఉంటుంది.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ముతఫ్ఫిఫీన్సూరా అల్-బురూజ్ ›