తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-కాఫిరూన్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 109వ సూరా, 6 ఆయతులు, 603వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-కౌథర్సూరా అన్-నస్ర్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!

2. మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;

3. మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.

4. మరియు మీరు ఆరాధించిన వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;

5. మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.

6. మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"[1]

[1] చూమీరు మీ ధర్మాన్ని వదలటానికి సిద్ధంగా లేనప్పుడు! నేను నా సత్యధర్మాన్ని ఎందుకు వదలాలి? చూడండి, 28:55.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-కౌథర్సూరా అన్-నస్ర్ ›