ముస్‌హఫ్‌లో 97వ సూరా, 5 ఆయతులు, 598వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో[1] అవతరింపజేశాము.[2]
[1] ఈ రాత్రి 'రమదాన్ నెలలోని చివరి 10 రోజులలో బేసి రాత్రులలో ఒకటని, చాలా 'హదీస్'లు ఉన్నాయి. ఈ రాత్రిలో పూర్తి సంవత్సరపు తీర్మానాలు తీసుకోబడతాయి. ఈ రాత్రిలో చాలా మంది దైవదూత ('అలైహిమ్) లు దిగుతారు. చూడండి, 2:185. [2] ఏడవ ఆకాశం పైన ఉండే లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి మొదటి ఆకాశంలోఉండే బైతుల్ 'ఇ'జ్జహ్ లో దివ్యఖుర్ఆన్ ఖద్ర్ రాత్రిలో అవతరింపజేయబడింది. (ఇబ్నె-కసీ'ర్).
2. మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
3. ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.[1]
[1] చూఈ రాత్రిలో చేసే ఆరాధన విలువ, వేయి నెలల కంటే ఎక్కువ అంటే 83 సంపత్సరాలు మరియు 4 నెలలు.
4. ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[1], తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన (ఆజ్ఞలు తీసుకుని) దిగి వస్తారు.
[1] అర్-రూ'హు: ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. చూడండి, 19:17 మరియు 78:38 అర్-రూ'హు ఈ మూడుచోట్లలో జిబ్రీల్ ('అ.స.) కొరకు వాడబడింది. ఇంకా చూడండి, 19:17 వ్యాఖ్యానం 1, 26:193 మరియు 16:102.
5. ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.